ఆ కుట్రలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగమే: ప్రధాని మోదీ
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, సామాజిక వ్యవస్థను నిర్వీర్యం
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, సామాజిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అందులో ప్రతిపక్షాలు కూడా భాగమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ను బలహీనపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా కుట్రలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి విజయాన్ని నమోదు చేయడంపై ప్రధాని మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ, బీజేపీ హర్యానాలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని 90 సీట్లలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మెజారిటీ మార్క్ 46 కాగా కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది. హర్యానా ప్రజలు హృదయపూర్వకంగా తమను ఆశీర్వదించారని, బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ అన్నారు. హర్యానా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని హామీ ఇస్తున్నానన్నారు మోదీ. జమ్మూ కశ్మీర్ లో బీజేపీ సాధించిన ఫలితాల పట్ల గర్విస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.