నేడు గుజరాత్ తొలి విడత పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. తొలి విడతగా మొత్తం 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది

Update: 2022-12-01 02:17 GMT

గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. తొలి విడతగా మొత్తం 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 19 జిల్లాల్లో ఈ పోలింగ్ ను నిర్వహించనున్నారు. తొలి విడతగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఏడోసారి గెలిచేందుకు...
తొలి విడత పోలింగ్ లో 2.39 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం 25,430 పోలింగ్ బూత్ లను అధికారులు ఏర్పాటు చేశారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరగనుండగా రెండో దశ పోలింగ్ ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నారు. ఏడోసారి వరసగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా గుజరాత్ లో గెలవాలని ప్రయత్నిస్తుంది. 25 ఏళ్లు బీజేపీ ప్రభుత్వాన్ని చూసి విసిగిపోయిన ప్రజలు అధికారాన్ని తమకు అప్పగిస్తారన్న ఆశతో కాంగ్రెస్ ఉంది.


Tags:    

Similar News