Polling : ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

Update: 2024-04-19 12:41 GMT

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగాయి. ఇరవై ఒక్క రాష్ట్రాల్లో 102 పార్లమెంటు నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కిం శాసనసభకు కూడా ఎన్నికలు నేడు జరిగాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగాయి.

21 రాష్ట్రాల్లో...
తమిళనాడులో ఉదయం నుంచి కొంత ఓటర్లు తక్కువగా కనిపించినా తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు కేంద్ర ప్రాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలోనూ ఎన్నికలు జరగాయి.


Tags:    

Similar News