రాహుల్ రెస్యూ ఆపరేషన్ సక్సెస్.. ప్రాణాలతో బయటపడ్డాడు
రాహుల్ సాహు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని
బోరుబావిలో పడి 80 అడుగుల లోతులో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుడు రాహుల్ సాహును సుమారు 100 గంటలకు పైగా సాగిన ఆపరేషన్ తర్వాత మంగళవారం రాత్రి 11 గంటలకు రక్షించారు. ఈ ఘటన ఛత్తీష్‌గఢ్‌లోని మల్ఖరోడా బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలో చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్ రాహుల్‌కు చాలా దగ్గరగా చేరుకుని.. రాత్రి 10.15 గంటలకు అతన్ని చూసింది. అతడు సజీవంగా, ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడని గుర్తించింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు, మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య బృందాలను సిద్ధం చేశారు. నివేదికల ప్రకారం, రెస్క్యూ ఆపరేషన్ కోసం దాదాపు 150 మంది అధికారులను నియమించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో రోబోలను కూడా వాడారు.
104 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రక్షించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), సైన్యం, స్థానిక పోలీసులు సహా 500 మందికి పైగా సిబ్బంది అక్కడే ఉన్నారు. వీరంతా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. రాహుల్ సాహు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలో 80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. అతను దాదాపు 60 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడి రాహుల్ ను బయటకు తీశారు.