రాజస్థాన్ లో బీజేపీ ఆధిక్యం

రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కొనసాగిస్తూ ఉంది. బీజేపీకి కాంగ్రెస్

Update: 2023-12-03 04:44 GMT

రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కొనసాగిస్తూ ఉంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీనిస్తోంది. బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు రాజస్థాన్‌లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. అయితే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమాగానే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అంతరం తక్కువగా ఉంది. జేపీ నడ్డా నేతృత్వంలోని పార్టీ ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ 130కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. రాజస్థాన్‌లో 100కిపైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కు మెజార్టీ కట్టబెట్టాయి. కానీ, ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.


Tags:    

Similar News