Big Family: వామ్మో ఒక కుటుంబంలో 2500 మంది... అందులో 1200 మంది ఓటర్లు
అసోం లోని రోన్ బహదూర్ కుటుంబంలో 2,700 మంది సభ్యులున్నారు. వీరిలో 1200 మందికి ఓటు హక్కు ఉంది
ఉమ్మడి కుటుంబాలు ఈరోజుల్లో అసలు ఉండవు. అలాగే పెళ్లి కావడమే కష్టం. పెళ్లి కాదు.. ఆ ఆసామి పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏకంగా ఐదుగురిని వివాహమాడాడు. అందరినీ ఒకే ఇంట్లో నివాసం ఉంచాడు. ఇక చూడండి.. ఆ ఐదుగురికి పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దోళ్లయితే.. వాళ్లకీ పెళ్లిళ్లు చేశాడు. మళ్లీ వాళ్లకు పిల్లలు... ఇలా ఆ ఇంట్లో ఇప్పుడు పన్నెండు మంది కుటుంబ సభ్యులున్నారు. అందులో పన్నెండు వందల మంది వరకూ ఓటర్లున్నారు. ఇది నిజం. మనదేశంలోనే. అసోంలో ఈ అరుదైన ఘటన చూసింది.
ఈ పన్నెండు వందల యాభై మందికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లున్నాయి. వీళ్లంతా ఈ నెల 19వ తేదీన జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలి పామ్ గ్రామంలో ఉండే రోన్ బహదూర్ తాపాకు ఐదు పెళ్లిళల్లయ్యాయి. ఈ ఐదుగురు భార్యలకు పన్నెండు మంది కుమారులను, పది మంది ఆడపిల్లలు జన్మించిన తర్వాత అయితే రోన్ బహదూర్ మరణించాడు. 1997లో ఆయన మరణించాడు.
రాజకీయ పార్టీల అభ్యర్థులు....
ఆ ఇరవై ఇరవై రెండు మంది పిల్లలకు మళ్లీ పెళ్లిళ్లయ్యాయి. వారికి పిల్లలు పుట్టారు. అందరూ కలసి ఆ కుటుంబంలో మొత్తం రెండువేల ఐదు వందల మంది సభ్యులున్నారు. వారిలో ఇప్పటికి 1200 మందికి ఓటు హక్కు వచ్చింది. దీంతో తాపా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరి అందరూ ఒకే కుటుంబంలో ఉంటారు కాబట్టి.. ఒకే మాట మీద నిలబడతారన్న నమ్మకంతో వారు ఓటు వేస్తే తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి రోన్ బహదూర్ లేకపోయినా ఆయన వారసులు మాత్రం ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కీలకంగా మారారు. అందుకే ఈ బిగ్ ఫ్యామిలీ ఓట్లు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.