కొత్త ఎన్నికల కమిషనర్లు వీరే

కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌కుమార్‌ లను నియమించారు.;

Update: 2024-03-14 12:04 GMT
కొత్త ఎన్నికల కమిషనర్లు వీరే
  • whatsapp icon

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియామకం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌కుమార్‌ లను నియమించారు.ఈ మేరకు ఎంపికల కమిటీ ఈ ప్రక్రి యను చేపట్టింది. ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడంతో చీఫ్ ఎన్నికల కమిషనర్ ఒక్కరే మిగిలారు. దీంతో సెలక్షన్ కమిటీ సమావేశమై కొత్త కమిషనర్ల నియామకం చేపట్టింది.

రాష్ట్రపతి ఆమోదం...
కొత్తగా చేపట్టిన కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు భర్తీ చేసినట్లయింది. మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్ని కలు జరగాల్సిన తరుణంలో అత్యవసరంగా వీరిద్దరి నియామకాన్ని చేపట్టింది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిషన్ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్‌లు ఉంటారు. సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Tags:    

Similar News