ఫేక్ సుప్రీం కోర్టు వెబ్ సైట్స్.. హెచ్చరికలు జారీ

నకిలీ వెబ్ సైట్లు, అకౌంట్లతో ఎంతో మంది ప్రతి రోజూ మోసపోతూ ఉన్నారు. ఇక పెద్ద పెద్ద సంస్థలు

Update: 2023-08-31 04:44 GMT

నకిలీ వెబ్ సైట్లు, అకౌంట్లతో ఎంతో మంది ప్రతి రోజూ మోసపోతూ ఉన్నారు. ఇక పెద్ద పెద్ద సంస్థలు, వ్యక్తులకు సంబంధించి కూడా మోసం చేస్తూనే ఉన్నారు. నకిలీ వెబ్‌సైట్లతో యూజర్ వివరాలు, కార్డ్ సమాచారాన్ని దొంగిలించడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా సుప్రీం కోర్టు పేరు మీద కూడా నకిలీ వెబ్ సైట్ గురించి కీలక ప్రకటన చేసింది. నకిలీ URLలకు సంబంధించి ఒకదానిలో 'మనీ-లాండరింగ్ నేరం' అనే శీర్షిక ఉంది

స్కామ్‌ లు చేసే వ్యక్తులకు ఏ వ్యక్తి లేదా సంస్థ అడ్డు కాదు. ప్రజల వ్యక్తిగత వివరాలను, రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు పేరును కూడా వాడుకుంటూ ఉన్నారు. ఈ స్కామ్‌పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అడ్వైజరీ జారీ చేసింది. అలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. అధికారిక సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను అనుకరిస్తూ నకిలీ వెబ్‌సైట్లు http://cbins/scigv.com , https://cbins.scigv.com/offence లు సృష్టించారు. వ్యక్తిగత వివరాలు, ఇంటర్నెట్-బ్యాంకింగ్, క్రెడిట్ డెబిట్ కార్డ్ సమాచారాన్ని దొంగిలించడానికి 'అఫెన్స్ ఆఫ్ మనీ-లాండరింగ్' శీర్షిక ఉన్న రెండవ URL ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి.. వివరాలను ఇస్తే మీ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు పేరు మీద ఉన్నది www.sci.gov.in ఈ వెబ్సైట్ మాత్రమే..! ఇతర వాటి మీద క్లిక్ చేయకండని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మీరు పైన పేర్కొన్న ఫిషింగ్ దాడికి గురైనట్లయితే, దయచేసి మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాలకు సంబంధించి మీ పాస్‌వర్డ్‌లను మార్చండి. వెంటనే మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ కంపెనీని కూడా సంప్రదించండి. రిజిస్ట్రీ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫిషింగ్ దాడి గురించి హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News