జనవరి 10 వరకూ పాఠశాలలకు సెలవులు.. !

రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షల ప్రకారం, 9 నుంచి 12 తరగతుల పాఠశాలలు కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి

Update: 2022-01-02 12:00 GMT

కరోనా సృష్టిస్తోన్న విధ్వంసాన్ని తట్టుకోలేక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు సర్కార్. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు కూడా మార్గదర్శకాలను సవరించారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో 1 నుంచి 8వ తరగతుల వరకూ పాఠశాలలను జనవరి 10 వరకూ మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. అలాగే 9వ తరగతి నుంచి కళాశాల వరకూ ఉన్న విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త ఆంక్షల ప్రకారం, 9 నుంచి 12 తరగతుల పాఠశాలలు కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి పనిచేయనున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చినవారు కాకుండా.. స్థానికంగా ఉన్నవారు కూడా ఇన్ఫెక్షన్ కు గురవుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు అనంతరం జనవరి 3వ తేదీన పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జనవరి 10వ తేదీ వరకూ పాఠశాలలు మూతపడనున్నాయి.


Tags:    

Similar News