Gnanavapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో తెలుగు శాసనాలు
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో తెలుగు శాసనాలు లభ్యమయ్యాయి
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో తెలుగు శాసనాలు లభ్యమయ్యాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఆఫ్ డైరెక్టర్ ఏ మునిరత్నం రెడ్డి చెప్పిన ప్రకారం తెలుగుతో పాటు కన్నడ, దేవనాగిరి శాసనాలు దొరికాయి. అయితే మూడు తెలుగు శాసనాలను అందించారు. ఒక శాసనం 17వ శతాబ్దానికి చెందినదని, అందులో మల్లన్న భట్లు, నారాయణ భట్లుల పేర్తు కూడా ఉన్నాయని మునిరత్నం రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రానికి చెందిన నారాయణ భట్లు కాశీ విశ్వనాధ్ నిర్మాణంలో 1585లో కీలక భూమిక పోషించారు.
ఆలయ పునర్నిర్మాణం...
1585లో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. రాజా తోడర్‌మల్లు ఆదేశంతో తిరిగి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఇప్పుడు దొరికిన శాసనాలు ఈ విషయాలను స్పష్టం చేస్తుందని మునిరత్నం రెడ్డి తెలిపారు. ఈ శాసనం జ్ఞానవాపి మసీదు గోడ మీద తెలుగులో ఉందని కూడా చెప్పారు. వాటిపై మల్లన్న భట్లు, నారాయణ భట్లు పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. రెండో శాసనంలో గోవి అని రాసి ఉందని, మూడో శాసనంలో మసీదు ప్రధాన ద్వారం ఉత్తర దిశగా ఉన్న గోడలపై లిఖించిన శాసనాలు చెరిగిపోయాయన్నారు.
మూడు భాషల్లో...
కొన్ని శాసననాలు తెలుగుతో పాటు దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నాయని తెలిపారు. అయోధ్యలో ఈ నిపుణులే శాసనాలను గుర్తించారని చెప్పారు. జ్ఞానవాపి మసీదు లోపల మొత్తం 34 శాసనాలు గుర్తించినట్లు ఇప్పటికే ఏఎస్ఐ నివేదిక వెల్లడించిది. మసీదు నిర్మాణంలోనూ, మరమ్మత్తుల్లోనూ ఉపయోగించిన రాళ్లలో హిందూ ఆలయంలోని రాళ్లు ఉన్నాయని గుర్తించారు. వీటి ఆధారంగానే ముందున్న ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారనే అభిప్రాయానికి వచ్చినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదక స్పష్టం చేసింది.