Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది;
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒక రైతు గుండెపోటుతో మరణించారు. శంభూ సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అయితే పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
గుండెపోటుతో రైతు మృతి....
ఈ సందర్భంగా పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిపైకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఐదు రోజుల నుంచి శంభూ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, రైతులకు మధ్య చర్చలు కూడా సఫలం కాలేదు. దీనికి తోడు రైతు మరణించడంతో మరింత ఉద్రికత్త తలెత్తింది.