Maharashtra : మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పై తొలగని సస్పెన్స్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు;

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న రాత్రి దాదాపు రెండు గంటల పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు మహాయుతి నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్ లు హాజరయ్యారు. అయితే రెండు గంటల పాటు జరిగిన సమావేశంలోనూ ఇంకా ముఖ్యమంత్రి పేరు ఫైనల్ చేయలేదని తెలిసింది.
రెండు గంటలు సమావేశమయినా...
దీంతో పాటు మంత్రి పదవుల విషయంపై కూడా స్పష్టత రాలేదని సమాచారం. డిప్యూటీ సీఎంలు ఉంటారని మాత్రం తేల్చారు. అయితే సమావేశం పూర్తయిన తర్వాత కూడా ఎవరూ పెదవి విప్పకపోవడంతో ఈరోజు కూడా మరొకసారి సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. బీజేపీకి అత్యధిక స్థానాలు వవచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి స్థానం తీసుకోవాలన్న నిర్ణయానికి మాత్రం వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్వరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.