ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. ఎందుకంటే?

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి నిరసనగా నేడు రైతుల సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నాయి

Update: 2022-08-22 04:09 GMT

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి నిరసనగా నేడు రైతుల సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళన చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులు పెద్ద సంఖ్యలో ఎవరూ ఢిల్లీ నగరంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిరుద్యోగ సమస్యపై...
జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న మహా పంచాయత్ కోసం ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ ను విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఘాజీ పూర్, సింగ్, థిక్రీ వద్ద ఉన్న మూడు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పికెట్లను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Tags:    

Similar News