Toll Charges : నేటి నుంచి టోల్ ఛార్జీల పెంపు
జాతీయ రహదారులపై నేటి నుంచి టోల్‌గేట్ ఛార్జీలు పెరగనున్నాయి
జాతీయ రహదారులపై నేటి నుంచి టోల్‌గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈరోజు అర్థరాత్రి నుంచి టోల్ ఛార్జీలను పెంచాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఏప్రిల్ ఒకటోతేదీన టోల్ ఛార్జీలను ప్రతి ఏడాది పెంచుతుంటారు. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపుదలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కోరడంతో మూడు నెలల పాటు వాయిదా వేసింది.
నేటి అర్థరాత్రి నుంచి...
నిన్నటి తో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో నేటి అర్థరాత్రి నుంచి ఈ రుసుములను పెంచుతూ నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సగటున ఐదు శాతం టోల్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని జాతీయ రహదారులపై నేటి నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను ఎన్‌హెచ్ఏఐ పెంచుతూ వస్తుంది.