Vishnudev Sai : సర్పంచ్ నుంచి సీఎం వరకూ... ప్రస్థానం అదిరిపోలా
ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ను శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు
ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ను శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు విష‌్ణుదేవ్ సాయ్ ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ కు అంత సులువుగా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఆయన పార్టీకి నమ్మకమైన నేతగా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నియ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పనిచేశారు.
గిరిజన నేతగా ....
గిరిజననేతగా ఉన్న విష‌్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. 1990 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యరు. సీనియర్ నేతలను పక్కన పెట్టి విష్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేయడం వెనక అనేక ఈక్వేషన్లు ఉన్నాయి. గతంలో రెండుసార్లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీనే నమ్ముకోవడం ఆయనకు ప్లస్ అయింది.
సీనియర్లను పక్కన పెట్టి....
మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను పక్కన పెట్టి మరీ విష్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేయడమంటే ఆయన పార్టీకి అంకిత భావంతో చేసిన కృషి అనే చెప్పుకోవాలి. ఒక్క రాయగఢ పార్లమెంటు నియోజకవర్గం నుంచే నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గిరిజన నేతగా ఉన్న ఆయనను ఎంపిక చేసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా గిరిజనులు అత్యధిక ప్రాంతాలున్న నియోజకవర్గాలను సొంతం చేసుకోవచ్చన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఉండి ఉండవచ్చు. మొత్తం మీద సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విష్ణుదేవ్ సాయ్ ను అందరూ అభినందిస్తున్నారు.