అనర్హతల వేట మొదలైనట్టేనా?

సరిగ్గా ఇదేరోజు మరో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జహీరాబాద్ లోక్ సభ సభ స్థానం నుంచి;

Update: 2023-07-26 04:54 GMT
disqualification petitions on telangana mlas

disqualification petitions on telangana mla's

  • whatsapp icon

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే వనమాపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసిన కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. అంతేకాదు 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కాగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వర్ రావు పోటీ చేయగా.. బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు బరిలో నిలిచారు. ఈ పోటీలో వనమా వెంకటేశ్వర్ రావు 4,139 ఓటల్తో గెలుపొందగా ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.

అయితే వనమా తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం (జులై25) తీర్పును వెలువరించిన కోర్టు.. వనమా ఎన్నిక చెల్లదని తేల్చేసింది. పైగా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావునే కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా బిగ్ షాక్ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్ ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో మంత్రి దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.
సరిగ్గా ఇదేరోజు మరో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జహీరాబాద్ లోక్ సభ సభ స్థానం నుంచి గెలిచిన ఆయన పై.. కె మదన్ మోహన్ రావు అనే వ్యక్తి తెలంగాణ హై కోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ హై కోర్టు బీబీ పాటిల్ పై రోజువారీ విచారణకు ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తన అనర్హత పిటిషన్ పై హై కోర్టు లోనే తేల్చుకోవాలని పేర్కొంటూ సుప్రీం కోర్టు అతని పిటిషన్ ను తోసిపుచ్చింది.
మరో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రస్తుతం అనర్హత వేటు పిటిషన్‌ను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. కొప్పుల ఈశ్వర్ పై ఐదారు అంశాలను పేర్కొని అతని గెలుపును ఛాలెంజ్ చేశారు. లక్ష్మణ్ వేసిన పిటిషన్ కు తొలుత స్పందించలేదు. ఆ తర్వాత లక్ష్మణ్ తన పిటిషన్ ను ఎగ్జిక్యూట్ చేయమని కోరగా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఒత్తిడి మొదలైంది. ఈ కేసు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు ఇబ్బంది పడిన సందర్భం ఉంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ కి తలనొప్పిగా ఉన్న మరో నియోజకవర్గం వేములవాడ. అక్కడి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై కూడా అనర్హత వేటు వేయాలంటూ నాలుగేళ్ల క్రితం ఓ పిటిషన్ పడింది. రమేష్ ఇండియన్ కాదని, ఆయన జర్మన్ సిటిజన్ అని, అతని సభ్యత్వం చట్ట విరుద్ధం అంటూ వ్యాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యం పై కోర్టు తీర్పు పెండింగ్ లో ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా అనర్హుల మీద వేటు పడటం ఇటు అధికార పార్టీ కి, పార్టీ లు జంప్ అయి మరి వచ్చిన నేతలకి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
2009 అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో టిడిపి అభ్యర్థి సుమన్ రాతోడ్ గెలిచారు. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఆ ఎన్నికలో సుమన్ రాథోడ్ పై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర నాయక్ ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ హై కోర్టును ఆశ్రయించారు. ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం రిజర్వ్డ్ అయితే.. సుమన్ రాథోడ్ మహారాష్ట్రకు చెందినామే. ఆ రాష్ట్రంలో బంజారాలు బ్యాక్వర్డ్ క్లాస్ కు చెందినవారు అవుతారు గానీ ఎస్టీ లు కారని పేర్కొంటూ.. అజ్మీర నాయక్ ఫలితాలను డిస్ క్వాలిఫై చేయాలంటూ సుమన్ రాథోడ్ పిటిషన్ వేశారు. వాదనలు జరిగి, ఆధారాలను పరిశీలించిన మీద 2013లో ఏపీ హై కోర్టు ఆమె పోటీ చట్టవిరుద్ధం అని తీర్పునిచ్చింది.

(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the author)


Tags:    

Similar News