Robot Attack: దాడికి తెగబడ్డ రోబో.. టెస్లాలో ఊహించని ఘటన

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు ఉందని చాలామంది

Update: 2023-12-28 09:15 GMT

RobotAttack

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు ఉందని చాలామంది హెచ్చరిస్తూనే ఉన్నారు. టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ కూడా గతంలో ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ఉన్న కంపెనీ గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో ఒక టెస్లా ఇంజనీర్ ఒక అసెంబ్లింగ్ రోబోట్ చేతుల్లో దాడికి గురయ్యాడు. డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక ప్రకారం ఇద్దరు ఉద్యోగులు తమ తోటి ఉద్యోగిపై రోబోట్ దాడి చేయడాన్ని చూసి భయాందోళనకు కూడా గురయ్యారు. దాడి చేసిన రోబో అల్యూమినియం కారు భాగాలను పట్టుకుని తరలించడానికి రూపొందించారు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే ఇంజనీర్‌ను కిందపడేసి.. తొక్కి పట్టినట్లు నివేదిక బయటకు వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన 2 ఏళ్ల క్రితం జరగ్గా తాజాగా ఆ సంఘటనకు సంబంధించిన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది.

రోబోట్‌ల కోసం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్న వ్యక్తిని రోబోట్ కింద పడేసినట్లు నివేదించారు. లోహపు గోళ్లతో కార్మికుని వీపు, చేతులపై దాడి చేసింది. దీంతో ఫ్యాక్టరీలో రక్తం చిందింది. ఈ సంఘటన బాధితుడి ఎడమ చేతిపై గాయం అయింది. ఈ దాడి 2021లో జరిగింది. ట్రావిస్ కౌంటీ మరియు ఫెడరల్ రెగ్యులేటర్‌లకు దాఖలు చేసిన నివేదికలో వెల్లడైంది. రక్తస్రావంతో ఉన్న టెస్లా ఇంజనీర్ అసెంబ్లీ రోబోట్ పట్టు నుండి బయటపడేందుకు చాలానే శ్రమించాడు. ఒక తోటి కార్మికుడు అత్యవసర 'స్టాప్' బటన్‌ను నొక్కడంతో పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. కారు విడిభాగాలను తయారు చేసేందుకు అల్యూమినియం పలకలను కోయడం, ఇతర పనులకు ఈ రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో ఒక సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడినట్టు గిగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన ఒక నివేదికలో ఈ విషయం బయటపడింది. 3 రోబోలను ఇన్ యాక్టివ్ చేయగా అందులోని ఒక రోబో ఊహించని విధంగా యాక్టివ్ అయినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో అది ఆ ఇంజనీర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదం మినహా 2021, 2022 లో ఇతర ప్రమాదాలు జరగలేదని రిపోర్ట్ వెల్లడించింది. కానీ టెస్లా గిగా ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది.


Tags:    

Similar News