సమంతకు వచ్చిన 'మయోసైటిస్' వ్యాధి అంటే ఏమిటి? ప్రాణాంతకమా? చికిత్స ఉందా?

మయోసైటిస్.. ఇది దీర్ఘకాలిక కండరాల వాపు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా..

Update: 2022-10-29 14:21 GMT

symptoms of myositis

తాను కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ.. తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. సమంతకు ఏదో అరుదైన వ్యాధి వచ్చిందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సమంతకు వచ్చింది మయోసైటిస్ వ్యాధి. మయోసైటిస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి ? చాలా తక్కువమందికి తెలుస్తుంది..

మయోసైటిస్.. ఇది దీర్ఘకాలిక కండరాల వాపు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. ఒక్కోసారి గుర్తించలేరు కూడా. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా కొన్ని సార్లు నిర్ధారించలేము. కాలక్రమేణా ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అమెరికాలో ఉంటారు. ప్రతి ఏటా అక్కడ కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు నమోదవుతుంటాయి. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా.
మయోసైటిస్ లో ఐదు రకాలు
మయోసైటిస్ లో ఐదురకాలున్నాయి. అవి.. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్ (బాలలు), పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్. కాగా.. మయోసైటిస్ ఎందుకు వస్తుందన్నదానిపై సరైన స్పష్టత లేదు. నిపుణుల్లోనూ దీనిపై భేదాభిప్రాయాలున్నాయి. మయోసైటిస్ రీరం కండరాలపై దాడి చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు, సాధారణ జలుబు, ఫ్లూ, హెచ్ఐవీ వంటి వైరస్ లు, విషపూరిత ఔషధాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కండరాల బలహీనత, అలసట అనేవి అనేక వ్యాధుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు కావడంతో.. మయోసైటిస్ ను గుర్తించడం కష్టమవుతుంది.
మయోసైటిస్ కు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లేదా మెడికేషన్ లాంటివి ఇంకా లేవు. ఈ వ్యాధి ఉన్నవారికి వైద్యులు.. Prednisone వంటి Corticosteroids డ్రగ్ ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ డ్రగ్ ను Azathioprine (Azasan), Methotrexate (Trexall)తో కలిపి ఇస్తారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయి. మయోసైటిస్ కు చికిత్స తీసుకోకుండా నిర్ల్యంగా ఉంటే మాత్రం.. ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమంత త్వరగా ఈ వ్యాధి నుండి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Tags:    

Similar News