యాషెస్: ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా

ఐదో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనిస్తున్నట్టు కనిపించింది. కానీ చివర్లో కమిన్స్, లైయన్;

Update: 2023-06-21 02:38 GMT

  తొలి టెస్టులో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లైయన్ జోడీ ఇంగ్లండ్ బౌలర్లను అడ్డుకుని సంచలన విజయాన్ని జట్టుకు అందించారు . కమిన్స్ 44, లైయన్ 16 పరుగులతో అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో ఇంగ్లండ్ విజయానికి చేరువవగా.. ఊహించని ఇన్నింగ్స్ తో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఇంగ్లండ్ కు విజయాన్ని దూరం చేసి హీరోగా నిలిచాడు.

విజయానికి ఆసీస్ టార్గెట్ 281 పరుగులు కాగా చివరి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఓవర్ నైట్ స్కోరు 107/3 తో ఐదో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనిస్తున్నట్టు కనిపించింది. కానీ చివర్లో కమిన్స్, లైయన్ జోడీ పోరాడడంతో విజయం ఆసీస్ ను వరించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 393/8 వద్ద స్కోరు డిక్లేర్ చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేయగా ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (197 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధశతకంతో పోరాడాడు.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్‌ గ్రీన్‌ (28), అలెక్స్‌ కారీ (20) విలువైన పరుగులు జతచేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ 3, రాబిన్‌సన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. లియాన్‌ (16 నాటౌట్‌)తో కలిసి కమిన్స్‌ 9వ వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించడంతో కంగారూలు విజయం సాధించారు. ఖవాజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 28 నుంచి జులై 2 వరకు జరగనుంది.


Tags:    

Similar News