టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

విశాఖ వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది;

Update: 2023-03-19 07:47 GMT

విశాఖలో జరుగుతున్న వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమనాలతోనే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే ఒక మ్యాచ్ ను గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను కూడా గెలిచుకున్నట్లే అవుతుంది. వర్షం కురిసే అవకాశముండటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగితేనే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. 

సిరీస్ గెలవాలంటే...
మరోవైపు సిరీస్ లో తాము విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ లో సత్తా చాటాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ గెలిచేందుకు ఆస్ట్రేలియా సర్వశక్తులు ఒడ్డుతుంది. ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లో ఎవరిది గెలుపన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖలో జరుగుతున్న మ్యాచ్‌కు స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.


Tags:    

Similar News