Shikhar Dhawan : లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా ఆడుతూ...శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. భారత బ్యాటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు;

Update: 2024-08-24 04:39 GMT
shikhar dhawan,  indian batsman,  goodbye, cricket
  • whatsapp icon

ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. భారత బ్యాటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంటర్నేషనల్, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శిఖర్ ధావన్ ప్రకటించారు. ఈరోజు ఉదయం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆయన అభిమానులు ఒకింత బాధపడుతున్నారు. క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు చెబుతున్నా.. అయినా నా హృదయం శాంతితో నిండిందని, తన దేశం కోసం ఆడానంటూ ఆయన ట్వీట్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.

ఆలస్యంగా కెరీర్...
శిఖర్ ధావన్ తన కెరీర్ ను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ 20 మ్యాచ్ లు ఆడారు. ఈ ఆటల్లో వన్డేల్లో శిఖర్ ధావన్ 6,793 పరుగులు చేశాడు. టెస్టుల్లో 2,315 పరుగులు, టీ20లో 1,759 రన్స్ చేశాడు. వన్డేలో పదిహేడు సెంచరీలు, టెస్టుల్లో ఏడు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్ ఇక క్రికెట్ లో కనిపించడన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Tags:    

Similar News