రహానేకు చోటు.. సూర్యకు దక్కని అవకాశం

ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది;

Update: 2023-04-25 08:16 GMT

ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న రహానేకు అవకాశం కల్పించింది. సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం పక్కన పెట్టింది. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఓవెల్‌లో ఆస్ట్రేలియా - భారత్ మధ్య టెస్ట్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

జట్టు ఇదే...
బీసీసీఐ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ టీంలో శుభమన్ గిల్, పుజారా, విరాట్ కొహ్లి, రహానే, కె.ఎల్. రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్‌లను ఎంపిక చేశారు. వన్డే జట్టును బీసీసీఐ సెలెక్టెడ్ కమిటీ ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News