మూడో టెస్ట్ లో గెలుపు దిశగా ఆసీస్

మూడో టెస్ట్ లో భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. 163 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆల్ అవుట్ అయింది;

Update: 2023-03-02 11:38 GMT

మూడో టెస్ట్ లో భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. 163 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆల్ అవుట్ అయింది. కేవలం 75 పరుగుల ఆధిక్యంతోనే ఇండియా ఉంది. దీంతో ఆస్ట్రేలియా కు విజయం సులువుగా మారనుంది. ఇండోర్ లో జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆట ఆసిస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం 75 పరుగులే లక్ష్యం కావడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలిచే అవకాశాలు లేవు.

బ్యాటర్లు విఫలం...
మూడో టెస్ట్ లో భారత బ్యాటర్లు, బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా బ్యాటర్లు వరసగా విఫలమవుతూ వచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పూజారా మాత్రం అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల ధాటికి భారత్ బ్యాటర్లు వరసగా ఇంటి దారి పట్టడంతో ఆసీస్ గెలుపునకు సులువుగా మారింది. కేవలం 76 పరుగుల విజయ లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ఉంది. భారత్ బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.


Tags:    

Similar News