భారత్ - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ నేడు
భారత్ - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి;
భారత్ - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ 2 -1 తో చేజిక్కించుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా సొంత గడ్డపై గెలవాలని భావిస్తుంది. వాంఖఢే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. రానున్న వన్డే ప్రపంచ కప్ ను కూడా గెలిచి క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించాలని భారత్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.
రెండు జట్లు...
టీం ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగానే ఉంది. ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లలో నిరూపితమయింది. బూమ్రా లేని లోటు కనిపిస్తున్నా వికెట్లను తీయగల బౌలర్లు టీంలో లేకపోలేదు. ఇక బ్యాటర్లు దాదాపు అందరూ ఫామ్ లోనే ఉన్నారు. విరాట్ కొహ్లి కూడా ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. ఇక ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయలేం. ఆ జట్టు ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా ఉంది. ఆజట్టును ఎదుర్కొని వన్డే సిరీస్ ను కూడా దక్కించుకోవాలంటే సమిష్టిగా శ్రమించడం అవసరం.