రెండో టెస్ట్ లోనూ గెలుపు దిశగా భారత్
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ గెలుపు దిశగా పయనిస్తుంది
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ గెలుపు దిశగా పయనిస్తుంది. కేవలం 41 పరుగులు మాత్రమే విజయానికి దూరంలో ఉంది. నిన్న బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఈరోజు ఆట ప్రారంభమయిన వెంటనే వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 113 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీసుకుని ఆసీస్ బ్యాటింగ్ ను మరోసారి కుప్ప కూల్చాడు. మిగిలిన మూడు వికెట్లను అశ్విన్ తీసేసి ఆల్ అవుట్ చేసేశాడు.
నిలకడగా ఆడితేనే..
దీంతో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ 74 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అవుటయ్యారు. రోహిత్ రన్ అవుట్ కావడం విశేషం. కొహ్లి 20 పరుగులు చేసి వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. విరాట్ తక్కువ పరుగులకే అవుట్ కావడం ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. ప్రస్తుతం క్రీజులో పుజారా,శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడుతున్నారు. 46 పరుగులతో భారత్ విజయం సాధించాల్సి ఉంది.