బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మూటగట్టుకున్న భారత్
టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265
ఫైనల్ కు ముందు ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ భారత్ మీద విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగా.. భారత్ ఇంకో బంతి మిగిలి ఉండగా 259 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ ఇన్నింగ్స్ లో శుభమాన్ గిల్ 121 తో రాణించాడు. అక్షర్ పటేల్ 42 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా పరుగులు చేయకపోవడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా.. మెహిదీ హసన్ 2, తన్జిమ్ హసన్ 2 వికెట్లతో రాణించారు.
టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్ లో కెప్టెన్ షకీబల్ హసన్ 80, తౌహిద్ హృదయ్ 54, నసుమ్ అహ్మద్ 44, మెహెదీ హసన్ 29 (నాటౌట్) రాణించారు. బంగ్లా జట్టు 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ షకీబల్ హసన్, తౌహిద్ హృదయ్ తో కలిసి టెయిలెండర్లు కూడా పోరాడడంతో బంగ్లా స్కోరు 250 మార్కు దాటింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహ్మద్ షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ల తీశారు.