INDvsNZ: టీమిండియాకు దక్కింది స్వల్ప ఆధిక్యమే!!

Update: 2024-11-02 08:36 GMT

India vs New Zealand 2024

ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 ర‌న్స్‌కు ఆలౌట్ అయింది. టీమిండియాకు 28 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (90) టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంత్ హాఫ్ సెంచ‌రీ (60) చేయ‌గా య‌శ‌స్వి జైస్వాల్ 30, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 38 (నాటౌట్) ర‌న్స్ చేశారు. రోహిత్ (18), విరాట్ కోహ్లీ (04), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (0) మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. జడేజా కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆఖర్లో సుందర్ భారీ షాట్స్ ఆడుతూ భారత్ ఆధిక్యం పెంచడానికి ప్రయత్నించినా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఎవరూ తోడుగా నిలవకపోవడంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించలేదు.

న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో అజాజ్ ప‌టేల్ ఐదు వికెట్లు తీసి రాణించాడు. హెన్రీ, సోధి, ఫిలిప్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. కివీస్ మొద‌టి ఇన్నింగ్స్ లో 235 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి ఓవర్లోనే భారత జట్టు బౌలర్ ఆకాష్ దీప్ సత్తా చాటాడు. టామ్ లాథమ్ ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.



Tags:    

Similar News