తిరిగి భారత జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో KL రాహుల్ భారతదేశానికి నాయకత్వం వహిస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో KL రాహుల్ భారతదేశానికి నాయకత్వం వహిస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లకు రెస్ట్ ఇవ్వగా. 18 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ లో సత్తా చాటిన దినేష్ కార్తీక్ కు భారతజట్టులో స్థానం దక్కింది. ఇక తన పేస్ తో భయపెట్టిన హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు కూడా టీమిండియాలో అవకాశం ఇచ్చారు. హార్దిక్ పాండ్యా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికాతో తలపడే T20I జట్టు: KL రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (wk), దినేష్ కార్తీక్ (wk), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
జూన్ 9న ఢిల్లీలో సిరీస్ ప్రారంభమవుతుంది, తర్వాత కటక్, వైజాగ్, రాజ్ కోట్, బెంగళూరులో మ్యాచ్‌లు జరుగుతాయి.