భారత్ ఆధిక్యం 223 పరుగులు
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ 400 పరుగులకు ఆల్ అవుట్ అయింది.;
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ 400 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆస్ట్రేలియా కన్నా 223 పరుగుల ఆధిక్యతతో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 177 పరుగులకే కుప్పకూలిపోయింది.
స్పిన్నర్లే బెటర్...
అనంతరం బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడి 400 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 120, అక్షర్ పటేల్ 84 పరుగులు, జడేజా 70 పరుగులు చేశారు. జడేజా ఐదు వికెట్లను తీసి తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఇటు బ్యాటింగ్ లోనూ భారత స్పిన్నర్లు తమ సత్తా చాటారు.