టీం ఇండియా ఆల్ అవుట్

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది;

Update: 2023-03-01 07:27 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తక్కువ పరుగులకే భారత్ ఆల్ అవుట్ కావడంతో భారత్ అభిమానులు డీలా పడిపోయారు. దీంతో ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ముందు పెద్దగా స్కోరు చేయేలేకపోయింది. బ్యాటర్లందరూ విఫలం కావడంతో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అతి తక్కువ స్కోరుకే చేతులెత్తేస్తింది.

చేతులెత్తేసి...
ఉదయం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 12, గిల్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి దిగిన పుజారా కూడా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. జడేజా కూబి నాలుగు పరుగులకే అవుటయ్యాడు. . శ్రేయస్ అయ్యర్ పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక విరాట్ కొహ్లి 22, భరత్ 17 పరుగులు చేశారు. అనంతరం క్రీజులో వచ్చిన అక్షర్ పటేల్, అశ్విన్‌, ఉమేష్ యాదవ్ లు కూడా రాణించలేకపోవడంతో భారత్ అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది.


Tags:    

Similar News