నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టెస్ట్
ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్ నేడు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది
ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్ నేడు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత్ రెండో టెస్ట్ లోనూ గెలిచి సిరీస్ పై పట్టుబిగించాలని చూస్తుంది. గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కూడా భారత్ కు కీలకమే. ఇప్పటికే భారత్ టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ, టీ 20 లోనూ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ టెస్ట్ లో గెలిస్తే మరిన్ని పాయింట్లు సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది.
సూర్యా అవుట్...
ఛతేశ్వర్ పూజరాకు ఇది వందో టెస్ట్ కావడం గమనార్హం. ఈ టెస్టులో సెంచరీ కొట్టి అరుదైన ఘనతను సాధించాలని పుజారా ఉవ్విళ్లూరుతున్నారు. గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ రాణించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రాణించడంతోనే తొలిటెస్ట్ లో భారత్ కు విజయం దక్కింది. తొలి మ్యాచ్ లో విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించలేదు. అయితే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయర్ కు ఛాన్స్ దక్కే అవకాశముంది. మొత్తం మీద రెండో టెస్ట్ లో రాణించాలని టీం ఇండియా ప్రయత్నిస్తుంది. ఆస్ట్రేలియా కూడా అదే సమయంలో రెండో టెస్ట్ ను గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతుంది.