IPL 2023 AUCTION : ఐపీఎల్ మినీ వేలంలో.. సామ్ కరన్ సరికొత్త రికార్డ్
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా మినీ వేలంలో భారీ ధర పలికాడు. ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లతో ..;
ఐపీఎల్ 2023 సీజన్ కోసం నేడు కేరళలోని కొచ్చిలో మినీ వేలం నిర్వహించారు. ఈ మినీ మెగా వేలంలో ఇప్పటి వరకూ అత్యధిక వేలం పలికిన ఆటగాడు సామ్ కరన్. ఇంగ్లండ్ ఆల్రౌండర్ అయిన సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ ఏకంగా.. రూ.18.50 కోట్లకు వేలం పాడి తన సొంతం చేసుకుంది. తొలుత సామ్ కరన్ కోసం.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ పోటీపడగా.. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ రావడంతో.. అతడి వేలం అమాంతం పెరిగింది. గతంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక వేలం పలికిన క్రిస్ మోరిస్ (16.25 crore), యువరాజ్ సింగ్ రికార్డు (16 crore) ను సామ్ కరన్ చెరిపేసి, కొత్త రికార్డును సృష్టించాడు.
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా మినీ వేలంలో భారీ ధర పలికాడు. ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లతో అతడిని దక్కించుకుంది. కాగా.. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే.. ఇంగ్లండ్ యువకిశోరం హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు వేలం పాడింది. ఇక గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు దక్కించుకోగా.. అజింక్యా రహానే ను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.