దుమ్ము రేపిన కోహ్లీ.. ఆర్సీబీ క్వాలిఫికేషన్ ముంబై చేతుల్లో..!
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచి నిలిచింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచి నిలిచింది. ఫామ్ లేకుండా సతమతమవుతున్న మాజీ కెప్టెన్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, కెప్టెన్ ఫా డుప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేయడంతో ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రెండు వికెట్లు రషీద్ ఖాన్ తీశాడు.