సిరీస్ ఎవరిదో తేలేది నేడే
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి వన్డే నేడు జరగనుంది. చెన్నైలో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకుకు ప్రారంభమవుతుంది;
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి వన్డే నేడు జరగనుంది. చెన్నైలో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకుకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. 1 - 1 తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టును సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై సొంత గడ్డలో టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా కూడా పరాయి గడ్డపై భారత్ పై విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది.
స్వల్ప మార్పులతో...
పెద్దగా మార్పులు లేకుండానే భారత్ జట్టు బరిలోకి దిగనుంది. వరసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్ ను తప్పిస్తారని ప్రచారం జరిగినా ఈ మ్యాచ్ లో ఆడించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. సొంత మైదానం కావడంతో సుందర్ కు అవకాశమివ్వాలని భావిస్తుంది. ఆస్ట్రేలియా మాత్రం పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇక చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి సిరీస్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.