అవును.. ఆ స్టార్ క్రికెటర్ దోషిగా తేలాడు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్;
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేని(Lamichanne)ఖాట్మండూ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ కాదని వెల్లడించింది. జనవరి 10న లామిచానేకు శిక్ష ఖరారు కానుంది. గతేడాది ఆగస్టు 21న ఖాట్మండూలోని ఓ హోటల్‌లో లామిచానే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి విచారణకు హాజారుకావాలని ఆదేశించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న లామిచానే స్వదేశానికి తిరిగి రాకపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. వారు లామిచానేను నేపాల్ పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు లామిచానేను దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. త్వరలో శిక్ష ఖరారు కానుంది. ఐపీఎల్ ఆడిన తొలి నేపాల్ క్రికెటర్‌గా లామిచానే. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తరపున అతడు బరిలోకి దిగాడు. మంచి ట్యాలెంట్ ఉన్న ఆటగాడు ఇలాంటి పాడు పని చేశాడని తెలియగానే క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.