రోహిత్ శర్మ పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడా?

ఆలూరులో భారత ఆసియా కప్ శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 4వ రోజు ఒక ఆశ్చర్యకర

Update: 2023-08-29 02:40 GMT

ఆలూరులో భారత ఆసియా కప్ శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 4వ రోజు ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, KL రాహుల్ ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు క్రికెట్ నిపుణులు. సెప్టెంబర్ 2న క్యాండీలో జరిగే ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో.. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్‌ చేస్తాడని.. రోహిత్‌ను నంబర్ 3, విరాట్ కోహ్లీని నంబర్ 4 స్థానంలో పంపే అవకాశం కూడా ఉందని రాహుల్ ద్రవిడ్ & కో ఆలోచిస్తున్నారు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో భారత్ గత కొన్నేళ్లుగా సమస్య ఎదుర్కొంటోంది. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ రాణిస్తున్నా.. గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ప్రపంచకప్ 2023 ముందు అయ్యర్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా మేనేజ్మెంట్‌లో ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నాటికి కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకుంటే ఇషన్‌ కిషాన్‌కు జట్టులో చోటు దక్కుతుంది. అతడిని ఓపెనింగ్ పంపించి.. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

యువరాజ్ సింగ్ వైదొలిగాక.. భారత్ వన్డే జట్టులో నంబర్ 4 కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను ఈ స్థానం కోసం ఉపయోగించగా.. గాయాలు వారిని వెంటాడాయి. రాహుల్ కూడా ఓపెనింగ్ స్పాట్‌కు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. 2019 ప్రపంచకప్ తర్వాత 4వ స్థానంలో 805 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ ను దించే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మకు జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ పేరు సంపాదించాడు. అయితే కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకుంటే.. గిల్‌, ఇషాన్‌లతో ఓపెనింగ్‌ చేయించి.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీని దించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ.. ముగ్గురు ఓపెనర్లు భారత బృందంలో ఉన్నారు. వీరిలో కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరిని ఎంచుకోవాలి. రోహిత్ శర్మ తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, ద్రావిడ్ విభిన్న కలయికలను పరీక్షిస్తున్నాడు. విరాట్ కోహ్లిని అతడి స్థానం లోనే దింపి.. రోహిత్ శర్మ 4వ స్థానంలో ఆడిస్తే KL రాహుల్ తిరిగి వచ్చే వరకు ఒక సమస్యను పరిష్కరించవచ్చు.


Tags:    

Similar News