సాయి బాబా అంతా చూస్తున్నావుగా అంటూ పోస్టు పెట్టిన క్రికెటర్.. ఆడుతున్నా చోటు దక్కట్లేదు

Update: 2022-11-01 06:08 GMT

BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనల కోసం భారత జట్టులను ప్రకటించాడు. ఆ లిస్టులో పృథ్వీ షా కనిపించలేదు. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు ఆడనున్న భారత్, అదే జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల ODI సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. షాను ఎంపిక చేయలేదనే నిర్ణయం గురించి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగినప్పుడు, భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందిస్తూ తాము అతడి ప్రదర్శనను చూస్తూ ఉన్నామని, భవిష్యత్తులో అతనికి అవకాశం లభిస్తుందని అన్నారు. స్క్వాడ్‌లను ప్రకటించిన కొద్ది నిమిషాల తర్వాత షా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ నోట్‌ను పోస్ట్ చేశాడు. సాయి బాబా ఫోటోను పెట్టి.. అంతా చూస్తున్నావుగా అని చెప్పుకొచ్చాడు. "Hope you are watching everything Sai Baba," అంటూ షా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టాడు.

షా ను పక్కన పెట్టడంపై ప్రశ్నించగా, జట్టు సెటప్‌లో భాగంగా ఇప్పటికే మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని చేతన్ శర్మ చెప్పాడు. పృథ్వీ షాకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని పునరుద్ఘాటించాడు. "మేము పృథ్వీతో నిరంతరం టచ్‌లో ఉన్నాము. అతను బాగానే ఉన్నాడు. అతని తప్పు ఏమీ లేదు. ఇంతకు ముందు ఆడిన కుర్రాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారా అనేది చూడాలి. అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. సెలెక్టర్లు పృథ్వీతో నిరంతరం టచ్‌లో ఉంటారు. "అని చెప్పాడు.


Tags:    

Similar News