భారత్ ఆస్ట్రేలియా రెండో వన్డే - వర్షం పడే అవకాశం
భారత్ ఆస్ట్రేలియా రెండో వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
కలిగించే అవకాశాలున్నాయి. నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 18న భారీ వర్షం కురిసే అవకాశముందని కూడా తెలిపింది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ , ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకు మరొక ద్రోణి ప్రభావంతో అకాల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 19న...
ఇప్పటికే కోస్తా, దానికి ఆనుకుని ఒడిశాలో ఆకాశం మేఘావృతం అయింది. కోస్తాలో గురువారం నుంచి ఈ నెల 19 వరకు, రాయలసీమలో గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీన భారత్ - ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఇప్పటికే టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో అమ్ముడుపోయాయి. చివరకు విశాఖ క్రికెట్ ఫ్యాన్స్ కోరికను వరుణదేవుడు నెరవేరుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.