రవి చంద్రన్ అశ్విన్.. ఇంత అరుదైన రికార్డు నీకేనయ్యా

రవి చంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్‌ రవిచంద

Update: 2023-07-13 02:20 GMT

రవి చంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ను ఔట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత అందుకున్నాడు. 2011 సంవత్సరంలో వెస్టిండీస్‌తో మ్యాచుల్లో టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఆ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయిన వారిలో శివనారయణ్‌ చందర్‌పాల్ ఒకడు. శివనారయణ్‌ చందర్‌పాల్ కొడుకే ప్రస్తుతం వెస్టిండీస్‌ జట్టులో ఓపెనర్‌ తగెనరైన్ చందర్‌పాల్. టెస్టుల్లో తండ్రీ కొడుకులను ఔట్‌ చేసి తొలి భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్‌. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు టెస్టు క్రికెట్‌లో ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్ ఈ ఘనత సాధించారు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసింది. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి రోజు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 5 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. వెస్టిండీస్‌ ఆలౌట్ అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్ మొదలెట్టింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మతో కలిసి 23 ఓవర్లు ఆడి 80 పరుగులు చేశారు.


Tags:    

Similar News