టెన్నిస్ కు సానియా గుడ్ బై.. ఆమె ట్రాక్ రికార్డులు చూశారా

చివరిగా గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్‌కు చేరువగా వెళ్లి ఫైనల్లో ఓడిన సానియా.. డబ్ల్యుటిఏ-1000 సిరీస్‌ ..;

Update: 2023-02-22 06:14 GMT

sania mirza tennis retirement

భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్ కు తుది వీడ్కోలు పలికింది. మంగళవారం (ఫిబ్రవరి 21) దుబాయ్‌ లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ లో తొలి రౌండ్‌ లో ఓటమితో కెరీర్ కు వీడ్కోలు పలికింది. చివరిగా గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్‌కు చేరువగా వెళ్లి ఫైనల్లో ఓడిన సానియా.. డబ్ల్యుటిఏ-1000 సిరీస్‌ ఛాంపియన్‌షిప్‌ లో అభిమానులను నిరాశపరిచింది. అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా.. తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. నెలరోజుల క్రితమే.. ఈ సిరీస్ తన టెన్నిస్ కెరీర్ లో చివరిదని ప్రకటించడంతో ఈ ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు.

కానీ.. ఆటమొదలైన గంటకే సానియా ఆట ముగియడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సానియా మీర్జా తన 20ఏళ్ల కెరీర్లో ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో‌ఆసియా గేమ్స్ ఇలా అన్నింట్లోనూ మెడల్స్ సాధించింది. 1986 నవంబర్ 15న జన్మించిన సానియా మీర్జా.. 2003లో టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించింది.
  •  సానియా మీర్జా నాలుగు ఒలింపిక్స్ (2008, 2012, 2016, 2020) లో పోటీపడింది. బోపన్నతో కలిసి 2016లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించడం ఒలింపిక్స్‌లో సోనియా అత్యుత్తమ ప్రదర్శన.
  • 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 కెరీర్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.
  • డబుల్స్ లో మాజీ ప్రపంచ నవంబర్ వన్. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్ సానియా.
  • డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సానియా మీర్జా ఘనత సాధించింది.
  • సింగిల్స్ అత్యుత్తమ ర్యాంకు 27 (2007 ఆగస్టు). డబుల్స్ అత్యుత్తమ ర్యాంక్ 1 (2015 ఏప్రిల్).
  • కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఇందులో మూడు డబుల్స్, మూడు మిక్స్‌డ్ టైటిళ్లు ఉన్నాయి.
  • ఆస్ట్రేలియా ఓపెన్ (2016), వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015)లలో గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.
  • ఆస్ట్రేలియా ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), యూఎస్ ఓపెన్ (2014)లలో గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్ టైటిల్స్ సాధించింది.
  • గ్రాండ్‌స్లామ్ డబుల్స్‌లో ఆరు టైటిల్స్ నెగ్గిన సానియా మీర్జా 91 వారాల పాటు ఏకధాటిగా మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగింది.
  • భారత ప్రభుత్వం తరపున అర్జున అవార్డు (2004), పద్మ శ్రీ (2006), ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (2015), పద్మ భూషణ్ (2016) అందుకుంది.
  • 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జా‌ను రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించింది.


Tags:    

Similar News