నేడు రెండో వన్డే - భారీ వర్ష సూచన

నేడే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ వన్డేకు వర్షం ఆటంకంగా మారనుంది.;

Update: 2023-03-19 02:58 GMT

నేడే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ వన్డేకు వర్షం ఆటంకంగా మారనుంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం కురుస్తుంది. మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలోని పిచ్ పూర్తిగా కప్పివేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మరో మూడు గంటల పాటు ఏపీకి భారీ వర్ష సూచననను వాతావరణ శాఖ ప్రకటించింది.

అనుమానాలు...
ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. తొలి మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో వన్డేలో కూడా సత్తా చూపి సిరీస్ ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ వరుణుడి ఆగ్రహంతో మ్యాచ్ జరిగే అవకాశాలు కన్పించడం లేదు. నిన్ననే చేరుకున్న ఇరు జట్లు హోటల్ లోనే ఉన్నాయి. ఉదయం మ్యాచ్ ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా కన్పించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కు నిరాశ తప్పదనిపిస్తుంది.


Tags:    

Similar News