నేడు ఇండియా - ఆస్ట్రేలియా రెండో టీ 20
నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. నాగపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది;
నేడు భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. నాగపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ 20 మ్యాచ్ లో ఓటమి పాలయిన భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. బౌలర్ల కారణంగానే గత మ్యాచ్ లో ఓటమి పాలయ్మామన్న అభిప్రాయంలో ఉంది. బూమ్రా లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఈరోజు మ్యాచ్ లో బూమ్రా ఆడతారా? లేదా? అన్నది సందేహంగానే ఉంది.
బౌలర్ల వైఫల్యంతో...
ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు విఫలమవుతుండటంతో ఈరోజు మరికొన్ని ప్రయోగాలకు భారత్ సిద్ధమయ్యే అవకాశముంది. బ్యాటింగ్ లో బలంగా ఉన్నా బౌలింగ్ పరంగా వీక్ గా ఉండటం కారణంగానే మ్యాచ్ లో వైఫల్యం చెందుతున్నామన్న భావన ఉంది. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపోటములు ఎవరిదైనా మరో మంచి మ్యాచ్ ను చూసే అవకాశం మాత్రం ఉంటుంది. నాగ్‌పూర్ లో ఈరోజు మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.