India Vs South Africa T20 : ఈ మ్యాచ్ అయినా జరుగుతుందా? ఈరోజు కూడా వర్షం ముప్పు?
ఈరోజు ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది
ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన ముహూర్తం బాగాలేనట్లుంది. తొలి మ్యాచ్ వర్షానికే పరిమితమయింది. మ్యాచ్ జరగలేదు. మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఈరోజు ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశముందని వాతావరణ శాఖ సూచించడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. మొదటి మ్యాచ్ డర్బన్ లో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది.
ప్రాక్టీస్ లేక...
రెండో మ్యాచ్ గబేహాలో జరగాల్సి ఉండగా ఈరోజు కూడా వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. కుర్రోళ్లు వరల్డ్ కప్ కు ముందు రాటు దాలేందుకు ఈ మ్యాచ్ లు ఉపయోగపడతాయనుకుంటే వర్షం కారణంగా మ్యాచ్‌లు జరగకపోవడంతో టీం ఇండియా జట్టులో కూడా నిరాశ కనిపిస్తుంది. టీ 20 ప్రపంచకప్ వచ్చే ఏడాది జూన్ లో జరగనుంది. ఈలోగా టీ20 మ్యాచ్ లు వివిధ దేశాలతో ఆడితే ప్రాక్టీస్ కు ప్రాక్టీస్ వస్తుంది. మెలుకువలు తెలుస్తాయి. ప్రత్యర్థి బలహీనతలు, బలాలు తెలుసుకునే వీలుంటుంది.
వరల్డ్ కప్ కు ముందు...
కానీ మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడం, రెండో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో టీం ఇండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ కొరవడింది. మైదానంలోకి దిగకుండానే హోటల్ గదులకే పరిమితమయ్యే పరిస్థితి కనిపించింది. యువ జట్టును ఎంపిక చేయడంతో వారంతా విదేశీ గడ్డపై రాటు దేలాల్సి ఉంటుంది. పట్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమలో తప్పొప్పులను సరిచేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తే వర్షంతో మ్యాచ్ లు రద్దు అవుతుండటం నిరాశకు గురి చేస్తుంది. ప్రధానంగా డెత్ ఓవర్లలో మనోళ్లు మరింత రాటు దేలాల్సిన అవసరం ఉండటంతో ఎన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడితే అంత మంచిది. ఈ సమయంలో వర్షం కురవకూడదని భగవంతుడిని ప్రార్ధించడం తప్ప మరేం చేయలేని పరిస్థితి.