India vs England 2nd T20 : నేడు భారత్ - ఇంగ్లండ్ రెండో టీ 20

భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.;

Update: 2025-01-25 02:55 GMT
india, england, second T20 match, chennai
  • whatsapp icon

భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే టీం ఇండియా 1 - 0 ఆధిక్యతలో ఉంది. ఏడు వికెట్ల తేడాతో కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని ఇండియా సాధించింది. ఈ మ్యాచ్ లో నూ గెలిచేందుకు ఇండియా తహతహలాడుతుంది.

రెండు జట్లు బలంగానే...
మరో వైపు ఇంగ్లండ్ కూడా చెన్నైలో విజయం సాధించి పగ తీర్చుకోవాలని భావిస్తుంది. తాము ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని తెలిపింది. రెండు జట్లు సమానమైన బలాలు కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగాసాగే అవకాశముంది. ఉత్కంఠ భరితంగా సాగే ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న అంచనాలపై ఇప్పటి నుంచిజోరుగా బెట్టింగ్ లు మొదలయ్యాయి. మరొక వైపు స్వల్ప మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది.


Tags:    

Similar News