మహ్మద్ సిరాజ్ గొప్ప మనసు

ఆసియా కప్ ఫైనల్లో తనకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కింద దక్కిన 4.15లక్షల రూపాయలని

Update: 2023-09-18 10:55 GMT

ఆసియా కప్ ఫైనల్లో తనకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కింద దక్కిన 4.15లక్షల రూపాయలని అదే గ్రౌండులో పనిచేసే కార్మికులకి అక్కడే అందజేసాడు మహ్మద్ సిరాజ్. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు మహ్మద్ సిరాజ్. ఈ అవార్డు ద్వారా వచ్చిన 5 వేల డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలకు పైగా) చెక్‌ని శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కి ఇవ్వాల్సిందిగా ప్రకటించాడు. అలా అందరి మనసు గెలుచుకున్నాడు మహ్మద్ సిరాజ్. పేద కుటుంబం నుండి వచ్చిన సిరాజ్‌ తనకు దక్కిన డబ్బుని గ్రౌండ్ స్టాఫ్ కు అందజేయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంత‌రం సిరాజ్ మాట్లాడుతూ ఇదంతా ఓ క‌ల‌లా ఉంద‌న్నాడు. త‌న స్పెల్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. ఈ రోజు పిచ్ ఎక్కువ‌గా స్వింగ్‌కు అనుకూలించింది. దీంతో ఔట్ స్వింగ‌ర్ల‌తో ఎక్కువ వికెట్లు ప‌డ‌గొట్ట‌గ‌లిన‌ట్లు తెలిపాడు. బ్యాట‌ర్లు ముందుకు వ‌చ్చి ఆడేలా ట్రాప్ చేసి విజ‌య‌వంతం అయిన‌ట్లు చెప్పాడు. గ్రౌండ్ మెన్స్ లేకుండా ఈ టోర్నీ సాధ్యం అయ్యేది కాదు. వాళ్ల క‌ష్టానికి గుర్తింపుగా నాకు వ‌చ్చిన ఈ ప్రైజ్ మ‌నీ మొత్తాన్ని వాళ్ల‌కు ఇచ్చేస్తున్నాను అని సిరాజ్ తెలిపాడు.

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 15.2 ఓవర్లలో 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్, ఓ మెయిడిన్‌తో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా 2.2 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రా 5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 23 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.. ఈ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది టీమిండియా.


Tags:    

Similar News