INDvsPAK: జూన్ 9న పాకిస్థాన్‌తో తలపడనున్న భారత్.. ఎక్కడంటే?
T20 ప్రపంచ కప్ 2024లో న్యూయార్క్‌లో జూన్ 9న భారత్ పాకిస్థాన్‌తో;
T20 ప్రపంచ కప్ 2024లో న్యూయార్క్‌లో జూన్ 9న భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. తమ చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు ప్రపంచ కప్ లో భాగంగా ఐర్లాండ్‌తో ఆడుతుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. టోర్నమెంట్ ఫైనల్‌కు బార్బడోస్ ఆతిథ్యమిస్తుంది. USAలో తమ గ్రూప్ గేమ్‌లు, వెస్టిండీస్‌లో సూపర్ 8 మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. భారత్ తమ చివరి గ్రూప్ స్టేజ్ గేమ్‌లో కెనడాతో తలపడనుండి. జూన్ 12న న్యూయార్క్‌లో USAతో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశల్లో భారత్ కోసం షెడ్యూల్:
జూన్ 5న భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)
జూన్ 9న భారత్ వర్సెస్ పాకిస్థాన్ (న్యూయార్క్)
జూన్ 12న భారత్ వర్సెస్ అమెరికా (న్యూయార్క్)
జూన్ 15న భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా)
భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధిస్తే, ఆ రౌండ్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న బార్బడోస్‌లో జరుగుతుంది. భారత జట్టు తమ సూపర్ 8 మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో ఆడనుంది. టోర్నమెంట్ ఫైనల్ జూన్ 29 న జరుగుతుందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారని తెలుస్తోంది.