షమీకి కోలుకోలేని షాక్
టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిందేనని పేర్కొంది
టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిందేనని పేర్కొంది. కోల్‌కత్తా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. షమీకి ఆయన భార్యకు మధ్య విభేదాలు చాలా కాలం క్రితం తలెత్తాయి. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. నాలుగేళ్ల క్రితం తనను వేధిస్తున్నాడని, షమీ నుంచి విడిపోవాలని అనుకుంటున్నానని షమి భార్య హసీన్ జహన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై షమిపై గృహహింస, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
భరణం కింద...
హసీన్ కు ప్రతి నెల 1.30 లక్షలు భరణం ఇవ్వాలని తీర్పుచెప్పింది. ఇందులో యాభై వేలు మాజీ భార్య ఖర్చుల కోసం, మిగిలిన ఎనభై వేలు వారి కుమార్తె భరణం కోసం ఈ భరణాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షమీ ఆయన భార్య హసీన్ విడిపోయిన తర్వాత కుమార్తె హసీన్ వద్దే ఉంటుంది. అయితే పది లక్షలు తనకు నెలకు భరణం కింద చెల్లించాలని హసీన్ కర్టును కోరగా 1.30 లక్షలు మాత్రమే నెలకు భరణం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది.