సిరీస్ చేజారింది.. కారణం అతడే!

ఆఖరి టీ20లో భారతజట్టు ఓడిపోయింది. దీంతో 3-2 తో విండీస్ సిరీస్ ను ఎగరేసుకుపోయింది.

Update: 2023-08-14 02:11 GMT

ఆఖరి టీ20లో భారతజట్టు ఓడిపోయింది. దీంతో 3-2 తో విండీస్ సిరీస్ ను ఎగరేసుకుపోయింది. మొదటి రెండు టీ20 మ్యాచ్ లలో విండీస్ ను విజయాలు వరించగా.. ఆ తర్వాత భారతజట్టు పుంజుకుంది. వరుసగా మూడు, నాలుగో మ్యాచ్ లు గెలిచింది. అయితే ఆఖరి మ్యాచ్ లో అటు బ్యాట్స్మెన్, ఇటు బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 166 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన విండీస్ ఇంకో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. కేవలం రెండే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను ముగించింది. ఓపెనర్ కింగ్ 85 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పూరన్ 47 పరుగులు చేసి విండీస్ గెలుపుకు కారణమయ్యాడు. పూరన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయి 165 రన్స్ చేసింది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (5), శుభ్‌మన్‌ గిల్‌ (9) నిరాశపరిచారు. మూడు ఓవర్లలోపే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. గిల్ ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడని అంపైర్ చెప్పగా.. రీప్లేలో నాటౌట్ అని తేలింది. రివ్యూకు వెళ్ళకపోవడంతో భారత్ అనవసరంగా వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో తిలక్‌ వర్మ (27; 18 బంతుల్లో 3×4, 2×6) సాయంతో సూర్యకుమార్‌ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన తిలక్‌ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సూర్యకుమార్ తన ఫామ్ కొనసాగిస్తూ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ 13, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో వర్షం చాలా చికాకు తెప్పించింది. టాస్ గెలిచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకోకపోవడం కూడా పెద్ద మైనస్ అని భావిస్తున్నారు.
హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో భారత్‌ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే మొదటిసారి. హార్దిక్‌ నేతృత్వంలో భారత్‌ ఇదివరకు నాలుగు సిరీస్‌లు గెలుచుకుంది. ఇక 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే మొదటిసారి.


Tags:    

Similar News