India vs Srilanka T20 : క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా.. సూర్య సక్సెస్.. మరి వన్డేల్లో రోహిత్ ఏం చేస్తారో?
శ్రీలంకపై టీం ఇండియా మూడో ట20 గెలిచింది. సూపర్ ఓవర్ లో విక్టరీ సాధించింది
శ్రీలంకలో పర్యటనలో ఉన్న టీం ఇండియా వరస గెలుపులతో ఊపు మీదుంది. టీం ఇండియా మూడు టీ20 మ్యాచ్ లు గెలిచి వైట్ వాష్ చేసింది. చేజారి పోతుందనుకున్న మ్యాచ్ తిరిగి అందిపుచ్చుకుంది. మూడో టీ20 ఖచ్చితంగా శ్రీలంక గెలుస్తుందని మ్యాచ్ ను చూసిన వారు ఎవరైనా అనుకున్నారు. అందుకు కారణం భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడమే. వరస పెట్టి అవుట్ కావడంతో శ్రీలంకకు ఈ మ్యాచ్ ఇచ్చినట్లేనని అనిపించింది. ఎందుకంటే యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఇలా వరస బెట్టి అవుట్ కావడంతో టీం ఇండియా సిరీస్ గెలిచినా ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోతుందని అందరూ అంచనా వేశారు.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. అందులో శుభమన్ గిల్ ఒక్కడే 39 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు అయినా లభించింది. వరస బెట్టి ఓపెనర్ దగ్గర నుంచి హిట్లర్లు అందరూ అవుట్ కావడంతో ఈ మ్యాచ్ చేజారినట్లేనని అనిపించింద.ి శ్రీలంక బౌలర్లలో తీక్షణ మూడు, హసరంగ రెండు వికెట్లు తీసి ఇండియాను చావుదెబ్బతీశారు. దీంతో 137 పరుగులు శ్రీలంకకు పెద్ద లక్ష్యమేమీ కాదన్నది అందరి అభిప్రాయంగా వినపడింది. మూడో మ్యాచ్ శ్రీలంక పరమయినట్లేనని భావించారు.
సూపర్ ఓవర్ లో...
అయితే అదే సమయంలో మ్యాజిక్ జరిగింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలో అదరగొట్టింది. నిశాంక 26, కుశాల్ మెండిస్ 43, కుశాల్ పెరీరా 46 పరుగులు చేశారు. శ్రీలంక చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఐదు ఓవర్లలో ముప్పయి పరుగులు చేయాలి. అంటే ఓవర్ కు ఆరు పరుగులు. ఇదేమీ పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ మన బౌలర్లు విజృంభించారు. బిష్ణోయ్, రింకూ, వాషింగ్టన్ సుందర్ లు వికెట్లు తీయడంతో 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్ లో లంక రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత సూర్య ఫస్ట్ బంతికే ఫోర్ బాదడంతో మ్యాచ్ భారత్ పరమయింది. దీంతో మూడు టీ 20లను భారత్ సొంతం చేసుకుంది.