అసలోళ్లు అవుటయినా.. కొసరోళ్లే మెరిశారు
బంగ్లాదేశ్ మీద అతి తక్కువ స్కోరు చేసి నవ్వుల పాలు కాకుండా పరువు నిలబెట్టారు. రవిచంద్ర అశ్విన్ సెంచరీ పూర్తి చేశారు.
బంగ్లాదేశ్ మీద అతి తక్కువ స్కోరు చేసి నవ్వుల పాలు కాకుండా పరువు నిలబెట్టారు. నిజానికి అసలు ఆటగాళ్లంతా అవుట్ కాగా, కేవలం స్పిన్నర్లు మాత్రమే అత్యధిక స్కోరును చేయగలిగారు. భారత్ - బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. అయితే తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ .. తడబడింది. కేవలం 34పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అసలు మూడంకెల స్కోరు చేస్తుందా? అన్న అనుమానాలు కలిగిన సమయంలో భారత్ తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
అశ్విన్ సెంచరీ....
అయితే రవిచంద్ర అశ్విన్ ఇందులో 102 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 86 పరుగులు చేశారు. దీంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరును చేయడమే కాకుండా రెండో రోజు ఆటలో కూడా నిల్చేలా వీళ్లిద్దరూ చేయగలిగారు. ఇద్దరూ దూకుడు మీద ఆడుతూనే స్కోరు బోర్డును వేగంగా పెంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ అసలు ఆటగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ లో అట్టర్ ఫెయిల్ అయ్యారు. రేపు ఆటలో కూడా భారత్ ఆటగాళ్లు మంచి స్కోరు చేయగలిగితే బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరు ఉంచేందుకు వీలవుతుంది.